శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదుగురు సభ్యులను విజయవాడ నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరిమునిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఐదుగురు నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులను అభినందించి, సన్మానించారు.