రాహుల్‌ను చార్జింగ్ వైర్‌తో చంపేశారు...

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (21:52 IST)
ఇటీవల యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ తన కారులోనే అనుమానాస్పదంగా మరణించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ పోలీసులు కేసులోని మిస్టరీని చేధించారు. ఇందులో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మొత్తం 13 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులైన కోకంటి సత్యం, విజయ్ కుమార్‌లు రాహుల్‌‌ను మొబైల్ చార్జర్ వైరుతో చంపేశారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు వెల్లడించారు. 
 
ఈ కేసు విషయమై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కారులో కూర్చొన్న రాహుల్‌ మెడకు మొబైల్ వైర్ చుట్టి.. అతను చనిపోయేంత వరకు కోగంటి సత్యం, కొరడా విజయకుమార్‌లు లాగిపట్టి చంపేశారని వివరించారు. 
 
ప్రధానంగా ఈ కేసులో నలుగురు వ్యక్తుల హస్తముందన్నారు. ఎన్నికల్లో డబ్బు పోగొట్టుకున్న కొరాడా విజయకుమార్.. కంపెనీలో తన వాటాను అమ్మాలంటూ రాహుల్‌పై విజయకుమార్ ఒత్తిడి చేశాడు. అయితే, ఆయన వాటాను ఇష్టపడని రాహుల్‌పై విజయ్ కుమార్ పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు