రేపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సమీకరణాలు మారనున్నాయి. మండలిలో రేపటి నుంచి ఆధిక్యంలోకి వైఎస్సార్‌సీపీ రానుంది. రేపు మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్ కానున్నారు.
మండలిలో 22 నుంచి 15కు టీడీపీ బలం పడిపోనుంది. గవర్నర్ కోటాలో తాజాగా నలుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మండలిలో 17 నుంచి 20కు వైఎస్సార్‌సీపీ బలం పెరగనుంది. రేపు వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి రిటైర్ కానున్నారు.
గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు.
మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.