ఈ సందర్భంగా ఎర్రబెల్లి పేకాట ఆడుతూ ఉన్నాడంటూ ఫొటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ నిషేధిత మత్తు పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియా కంటికి చిక్కారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను బ్యాన్ చేశారని, ఎక్కడైనా పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారని, కానీ మంత్రులకు ఎలా దొరికిందని, ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాడుతూ పట్టుబడ్డ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నాయని, అలాంటి సన్నాసి మంత్రుల ద్వారా బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని శ్రవణ్ ప్రశ్నించారు.
సాధారణ పౌరులు వినోదం కోసం పేకాట ఆడితే కేసులు పెట్టి నానా హింసలు పెట్టే పోలీసులు ఎందుకు ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గుట్కారాయుళ్ళు, గ్యాంబ్లర్స్‌తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే వీరిని మంత్రి పదవుల నుంచి బర్త్‌రఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రవణ్డిమాండ్ చేశారు.