హుజురాబాద్ ఎమ్మెల్యేగా నేడు ఈటల ప్రమాణం

బుధవారం, 10 నవంబరు 2021 (10:13 IST)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ కార్యాలయంలో ఈటల రాజేందర్‌ ప్రమాణం చేయనున్నారు. 
 
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి మే మాసంలో బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతేకాదు… ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరారు. అయితే ఇటీవల హుజురాబాద్‌ నియోజకవర్గానికి నిర్వహించి ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిపై ఈటల రాజేందర్‌ గెలుపొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు