సీఐడీ విచారణపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:13 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి.. సీఐడీ విచారలో వున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఐడీ విచారణ కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. 
 
క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో ఊరట లభించ లేదు. సీఐడీ పిటిషన్‌తో చంద్రబాబుకు రెండు రోజుల పాటు కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతింది. 
 
ఇక ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇకపై ఈ కేసులపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చంద్రబాబు టీం నిర్ణయానికి వచ్చింది. బాబు తరపున ఆయన న్యాయవాదులు క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు