మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

ఐవీఆర్

శుక్రవారం, 14 జూన్ 2024 (19:01 IST)
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుండే మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ట్వీట్ పైన చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ ట్వీట్లో ఆమె రాసిన మాటలే. ఇంతకీ ఆమె ఏం రాశారంటే... చెడు చేసి ఓడిపోతే సిగ్గపడాల, కానీ మంచి చేసి ఓడిపాయాము. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాము'' అంటూ పేర్కొన్నారు.
 
ప్రజలకు మంచి చేస్తే ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టే ప్రశ్నే వుండదన్నది ఎవరినైనా అడిగితే చెప్పే మాట. కానీ మంచి చేసినా ప్రజలు ఓడించారని రోజా అంటున్నారంటే... మరి తదుపరి ఎన్నికల నాటికి ఏం చేసి గెలుద్దామని అనుకుంటున్నారోనని ప్రశ్నిస్తున్నారు పలువురు ప్రజలు. దీనిపై రోజా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!pic.twitter.com/rZgit4c5Gq

— Roja Selvamani (@RojaSelvamaniRK) June 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు