సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

ఠాగూర్

సోమవారం, 31 మార్చి 2025 (14:56 IST)
వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కల సాకారమైంది. ఆయన పైలెట్ అయ్యారు. స్వయంగా విమానాన్ని నడిపారు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడిపిన కేతిరెడ్డి హైదరాబాద్ నగరంపై గగన విహారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన కల సాకారమైందని, ఇపుడు తానొక సర్టిఫైడ్ పైలెట్ అని వెల్లడించారు. 
 
'ఆకాశం ఇక హద్దు కాదు.. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠానికి ఈ ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక మీదట అంతులేని సాహసాలే. ఒంటరిగా ఇదే నా తొలిగగన విహారం. అందుకు వింగ్స్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని వెంకట్రామిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ఫస్ట్ ఫ్లయింగ్ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

"From dreams to reality—officially a PILOT! ✈️ The sky is no longer the limit; it’s just the beginning. Grateful for every challenge, every lesson, and everyone who supported me on this journey. Here’s to endless adventures ahead!

My first solo flying.
Thanks @wings team . pic.twitter.com/q8UBuIaGVR

— Kethireddy Venkatarami Reddy (@KethireddyMla) March 30, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు