ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీం కారణంగా తీవ్రంగా నష్టపోయిన, చిత్రహింసలకు గురైన మాజీ నక్సలైట్లు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మావోయిస్టులను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన ఓ మాజీ నక్సలైట్... నయీం చేతిలో ఏ విధంగా వేధింపులకు గురైంది పూసగుచ్చినట్టు వివరిస్తున్నాడు.
తన మాట వినని వారి పట్ల నయీం ఏ విధంగా ప్రవర్తిస్తాడో వివరించాడు. 'ముందు ప్యాంటు విప్పించి పిరుదుల మీద గుండుసూదులతో గుచ్చుతాడు. బంగారం, ఇనుము నమిలిస్తాడు. తీవ్రంగా కొట్టి తర్వాత ఓ పదివేలు ఇచ్చి వైద్యం చేయించుకోమంటూ ఇంటికి పంపిస్తాడు. తన కసి చల్లారకపోతే మార్మాంగంపైనా సూదులతో పొడుస్తాడు. ఆపై కారం చల్లిపిస్తాడు' అని ఓ మాజీ నక్సలైట్ చెప్పాడు.
ఏ హోదా నాయకుడు లొంగిపొయినా విధిగా తనను కలవాలని కోరుకోవడం వెనుక నయీం అభద్రతా భావమే కారణం అంటారు. వారు ఎదిగి తనకు స్పాట్ పెడుతారన్నదే అసలు భయం అని చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ గ్రామరక్షక దళం వ్యక్తి 'నయీమ్ ఎవరు? ఏం పీకుతాడు?' అన్నాడన్న విషయం తెలిసింది. అంతే.. రెండు రోజుల్లో అతణ్ని పట్టుకొని మర్మాంగాలు కొసి జేబులో పెట్టారని తెలిపారు.