తెలుగు చిత్రపరిశ్రమను మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఏలేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, యువ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్‌లతో పాటు నాగబాబు కుమార్తె నిహారిక ఉన్నారు. అయితే, అల్లు అర్జున్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎంతో కలిసికట్టుగా ఉన్నారు. ఈ విషయం "పుష్ప-2" మూవీ తొక్కిసలాట ఘటన, పోలీస్ కేసు, హీరో అల్లు అర్జున్ అరెస్టు తదితర విషయాల్లో నిరూపితమైంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు బన్నీని చరణ్ ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా అన్‌ఫాలో చేశారు. ఇపుడు ఈ విషయం తెలుగు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పైగా, బన్నీని అన్‌ఫాలో చేసిన రెండో మెగా హీరోగా రామ్ చరణ్ నిలిచారు. కొద్ది రోజుల క్రితమే సాయి దుర్గ తేజ్ సైతం బన్నీని అన్‌ఫాలో చేసిన విషయం తెల్సిందే.