కానీ, ఈ సెలవులను 18వ తేదీ వరకు పొడగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే, సంక్రాంతి సెలవుల పొడగింపు వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేయాల్సివుంది.