వరదలో కొట్టుకునిపోయిన వాహనాలను క్రేన్ల ద్వారా వెలికితీత (Video)

ఠాగూర్

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:32 IST)
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవేపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను క్రేన్ల సహయంతో ఆయా వాహనాల యజమానాలు బయటకు తీస్తున్నారు. క్రేన్ ఆపరేటర్ ఒక్కొక్క వాహనాన్ని బయటికి తీయటానికి రూ.12 వేలు తీసుకున్నాడని.. ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ వాహనాలను క్రేన్ల ద్వారా వెలికి తీసేలా చర్యలు తీసుకుంటామని చెబుతుంది. 
 
మరోవైపు, విజయవాడలో భవానీపురం, సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వరద పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 
 
వరద బాధితులతో మాట్లాడారు. ప్రజలతో మాట్లాడారు. వాళ్ళ బాధలు విన్నట్టు తెలిపారు. భరోసా ఇచ్చాను. ప్రజల స్పందన ఆధారంగా అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సాధారణ జీవితం గడిపే వరకు ప్రభుత్వం పని చేస్తుంది. ధైర్యంగా ఉండమని తెలిపారు. 

 

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవేపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను క్రేన్ల సహయంతో బయటకు తీసుకున్న యజమానులు.

క్రేన్ ఆపరేటర్ ఒక్కొక్క వాహనాన్ని బయటికి తీయటానికి రూ.12 వేలు తీసుకున్నాడని.. ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. pic.twitter.com/Qq0g1WoQEH

— Telugu Scribe (@TeluguScribe) September 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు