హైదరాబాద్‌లో కన్నబిడ్డను కన్నతండ్రే కాటేశాడు. కామంతో మదమెక్కిన కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తండ్రి దుశ్చర్యతో నిర్ఘాంతపోయిన ఆ మైనర్ బాలిక... జరిగిన ఘోరాన్ని కన్నతల్లికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.