మహిళా హోంగార్డును రేప్ చేసిన హెడ్‌కానిస్టేబుల్

మంగళవారం, 20 నవంబరు 2018 (11:00 IST)
బెంగుళూరులో ఓ మహిళా హోంగార్డుపై కామంతో కళ్లుమూసుకునిపోయిన హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్లడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరులోని నందిని లేఔట్‌ పోలీసు స్టేషన్‌లో 23 యేళ్ల యువతి హోంగార్డుగా పని చేస్తోంది. 
 
ఇదే ఠాణాలో ఓ వ్యక్తి హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హోంగార్డు వెంటపడుతూ లైంగికంగా వేధిస్తూ వచ్చిన ఆ కామాంధుడు.. ఈనెల 16వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి లైంగికదాడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితంలేకపోయింది.
 
దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలు, నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు