‌సీఎం జగన్‌పైకి వచ్చిన చెప్పు... మాజీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో వైరల్!!

ఠాగూర్

ఆదివారం, 31 మార్చి 2024 (10:13 IST)
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులోకోసం అన్ని పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వైకాపా అధినేత, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. అయితే, అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన నేపథ్యంలో గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి, కక్ష సాధింపు చర్యలకు దిగినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. 
 
వైకాపా ప్రేరేపిత దుండగులు కొందరు ఆయన వాహనంపై కర్రలు, చెప్పులు విసిరారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... అది దాడి కాదని, వారి భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు