అనుపమ అప్‌సెట్ అయ్యింది.. అందుకే రాలేదు.. టిల్లు స్క్వేర్ హీరో

సెల్వి

బుధవారం, 27 మార్చి 2024 (22:50 IST)
Tillu sequel
టిల్లు స్క్వేర్ థియేట్రికల్ విడుదలకు కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. దీంతో టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. సిద్ధు జొన్నలగడ్డతో పాటు మరికొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎక్కడా కనిపించలేదు. దాని వెనుక ఉన్న కారణాన్ని సిద్ధూ వెల్లడించాడు.
 
దీనిపై మాట్లాడాలా వద్దా అనే సందిగ్ధత వ్యక్తం చేస్తూ సిద్ధు జొన్నలగడ్డ ఓపెన్ అయ్యాడు. తాజాగా టిల్లు స్క్వేర్ పోస్టర్ విడుదలైన తర్వాత వచ్చిన వ్యాఖ్యలపై అనుపమ కలత చెందారన్నారు. అనుపమను సోషల్ మీడియా టైమ్‌లైన్‌లలో చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు వున్నాయని.. మహిళా నటీమణి గురించి విచ్చలవిడిగా రాయడం సరికాదన్నారు. 
 
ఇంకా మహిళా నటీమణుల గురించి వ్యాఖ్యానించేటప్పుడు గీత దాటవద్దని సిద్ధూ ప్రజలను అభ్యర్థించాడు. ఈ వ్యాఖ్యలు అనుపమను తీవ్రంగా కలత చెందెలా చేశాయి. ఈ కామెంట్స్ నటి మానసిక స్థితిపై ప్రభావం చూపాయి. అందుకే ఈ ఈవెంట్ నుండి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇకపై ఈ సినిమా ఈవెంట్లకు అనుపమ హాజరవుతుందని స్పష్టం చేశాడు. 
 
సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులువు కాదని, అందరూ అనుకున్నంత కంఫర్టబుల్‌గా లేదని అనుపమ గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు, పోస్టర్‌పై వ్యాఖ్యలు ఆమెను చికాకు పెట్టాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు