తెలంగాణాలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న షర్మిళ కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు వందలమంది షర్మిళకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతామని ప్రకటించి వెళ్ళిపోతున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోటస్ పాండ్‌లో వైఎస్ అభిమానుల సందడి కనిపిస్తోంది. అయితే సాధారణ కార్యకర్తల దగ్గర నుంచి రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ వరకు షర్మిళ పెట్టబోయే పార్టీలో పనిచేసేందుకు సిద్థపడుతున్నారు.
తాజాగా మాజీ డిజిపి స్వరణ్ జిత్ సేన్ సైతం షర్మిళ కొత్త పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వరణ్ జిత్ సేన్ సతీమణి అనితా సేన్ షర్మిళను కలిశారు. దాదాపు గంట పాటు అనితా సేన్ సమావేశమయ్యారు. అందరికీ తెలిసి కలిసిన వ్యక్తుల్లో మాజీ డిజిపి ఒకరైతే ఇంకా పదవీ విరమణ చేసిన చాలామంది షర్మిళలతో టచ్‌లో ఉన్నారట. ఎవరినీ నొప్పించకుండా అందరినీ పార్టీలో కలుపుకు పోవాలన్న ఆలోచనలో ఉన్నారట షర్మిళ.