కోర్టు ధిక్కార నేరం కింద ఎపి హైకోర్టుకు నలుగురు ఐఎఎస్ అధికారులు హాజరయ్యారు. వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు.
పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర కేసు విచారణ జరుగుతోంది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.