ఈ నేపథ్యంలో దళితబంధు పథకం కోసం హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.
కాంగ్రెస్, తెరాస, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేశారు పిటిషనర్లు. రైతు బంధు పథకం తరహలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడం సరికాదని పిల్ దాఖలు చేశారు.