అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి.
శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం : 3.5 కోట్లతో కల్యాణ మండపం. కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు.
కల్యాణ మంటపంలో వివాహ వేదికలు :సదుపాయాలివీ..
► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్‌రూం సౌకర్యం.