కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:59 IST)
ఏపీ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఏ కుటుంబంలో ఇలా జరగకూడదనీ, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరమన్నారు. కోడెల ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌తో మాట్లాడి నివేదిక కోరతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కేయడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లు పునఃప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. యురేనియం విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలు సరికాదన్నారు. పర్యావరణానికి హానికలిగించేలా ఏ ప్రభుత్వం నడుచుకోదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు