పార్లమెంట్ లో ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని కోరారు. మార్చి 2017లో అప్పటి టీడీపీ సర్కార్.. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల పేరు మార్చాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విజయవాడ విమానాశ్రయం ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు విమానాశ్రయాల పేరు మార్చాలనే తీర్మానాలను అప్పటి సీఎం బాబు.. హయాంలో ఏపీ అసెంబ్లీలో చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వైసీపీ వచ్చింది. దీంతో ఆ తీర్మానం రద్దు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో విమాన ప్రయాణికుల రద్దీని తీర్చడానికి, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కోసం టిఎస్ఐఐసికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'సైట్ క్లియరెన్స్' అనుమతి ఇచ్చిందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం దగ్గర ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి 1 ఆఫ్ 70 భూవివాదం ఉందని తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయం విషయంలో సైట్ క్లియరెన్స్ మంజూరు చేశామని ఆయన తెలిపారు.