ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంతో పాటు దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్ డీఓ కట్టుబడి ఉందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఇమ్యూనిటీ పెంచే 2 - డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
ఇప్పటికే పదివేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి సేవలందించామని స్వామీజీకి వివరించారు. తన హయాంలో రాడార్, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్ సతీష్ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు.