తన ప్రియుడు చేసిన మోసానికి ఆ ప్రియురాలు ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ కబుర్లు చెప్పిన తన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయడాన్ని సహించలేకపోయింది. ఆగ్రహంతో అతడు కొనుక్కున్న కొత్త బైకుపై పెట్రోల్ పోసి తగులబెట్టి బుగ్గి చేసింది.