ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. గుంటూరు అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ... పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం కాదని తమ పిల్లలకు తెలియ జేయాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దిశా వాహనం తిరుగుతూ ఉంటుంది, అవసర సమయంలో దిశా మహిళా పోలీస్ సిబ్బంది సహాయం పొందవచ్చని, మహిళలందరు పోలీసులు దిశా చట్టం గురించి మరియు దిశా యాప్ గురించి ప్రతి ఒక్క మహిళలకు కు పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు.
ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా దిశా యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే సంబంధిత అధికారులు సదరు ప్రదేశానికి వెంటనే చేరుకొని సహాయం చేయాలనీ ఆదేశించారు. మహిళలు అందరూ దిశా యాప్‌ను install చేసుకొని వారికి దగ్గరలో గల మహిళా పోలీస్ స్టేషన్‌కి విషయం తెలియపరచి సంబంధిత దిశా పోలీస్ అధికారు ద్వారా న్యాయం పొందవలసినదిగా తెలియచేశారు.