గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా 1.28 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అక్టోబరు 2 నుంచి అమల్లోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో లక్షా 26వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.