ఏపీలో పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (14:00 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శుభవార్త చెప్పారు. ఆయన కుప్పంలో పర్యటించారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదన్నారు. కుప్పం అంటే అక్కా చెల్లెళ్ళ అభివృద్ధి. కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి అని అన్నారు.
 
వరుసగా మూడో యేడాది వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేశామని చెప్పారు. అదేసమయంలో ఈ కుప్పం నుంచే మరో మంచి పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకించారు. 
 
రాష్ట్రంలో పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్టు సీఎం తెలిపారు. వచ్చే యేడాది జనవరి నుంచి రూ.2,750 చొప్పున పెన్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో ప్రస్తుతం అందిస్తున్న రూ.2,500 పన్షన్ వచ్చే యేడాది జనవరి నుంచి రూ.2,750కు పెరగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు