విద్యార్థులకు ఊరట.. జూలై నెల వీసా కోటా రిలీజ్ చేసిన యూఎస్ కాన్సులేట్

శనివారం, 26 జూన్ 2021 (09:54 IST)
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు ఊరట శుభవార్త అందింది. జులైలో ప్రారంభంకానున్న తరగతులకు హాజరు కావాల్సిన విద్యార్థుల గడువును మరో 25 రోజులు పొడిగిస్తూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. అదేసమయంలో జూలై నెల వీసా కోటాను కూడా యూఎస్ కాన్సులేట్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
ఆగస్టు పదో తేదీ నుంచి మరికొన్ని యూనివర్సిటీలు ప్రారంభంకానుండగా, ఆయా వర్సిటీల అధికారులతో సంప్రదించి తేదీలను తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు, కరోనా కారణంగా భారత్‌లో వీసా ప్రక్రియ నిలిచిపోయింది. 
 
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని కాన్సులేట్ల ద్వారా విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించాయి. 
 
ఇదిలావుంటే, శుక్రవారం జులైకి సంబంధించిన వీసా కోటాను కూడా విడుదల చేయడంతో విద్యార్థులు స్టాట్స్ పొందారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు