మొన్న పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పులివెందుల డీఎస్పీ మురళిని బెదిరించారు. "ఈ ప్రభుత్వం 2-4 నెలల్లో మారవచ్చు. ఆ తర్వాత మీ కథ వేరేలా ఉంటుంది" అని జగన్ బెదిరించారు. జగన్ దగ్గరి బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు శనివారం పులివెందులలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
ఆ విషయం పక్కన పెడితే, ఆ డీఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలాంటి బెదిరింపులను తేలికగా తీసుకోవడం ద్వారా ఆ శాఖ, ప్రభుత్వం ప్రజలకు, ప్రతిపక్షానికి ఎలాంటి సందేశం పంపుతోంది? అనే దానిపై చర్చ సాగుతోంది.