ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు.. తర్వాత మీ కథ ఉంటుంది : వైఎస్ జగన్

ఠాగూర్

సోమవారం, 13 జనవరి 2025 (14:17 IST)
'ఈ ప్రభుత్వం మరో రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు... ఆ తర్వాత మీ కథ ఉంటుంది' అంటూ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్‌గా హెచ్చరించారు. జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. 
 
ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. వివిధ విచారణల్లో భాగంగా, డీఎస్పీ దూకుడు పదర్శిస్తున్నారని జగన్ వద్ద వైకాపా నేతలు ప్రస్తావించారు. దీంతో హెలిప్యాడ్ వద్ద ఆగిన జగన్.. డీఎస్పీని పిలిపించారు. డీఎస్పీతో మరో ఇద్దరు సీఐలతో జగన్ వద్దకు వెళ్లారు. ఆయనను ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల రెండు రోజుల కస్టడీలో విచారించారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి పలుమార్లు విచారించారు. వీరందరినీ డీఎస్పీ విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాంటి పోలీస్ అధికారిని అందరిముందు జగన్ బెదిరించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు