కులాంతర వివాహాలు చేసుకుంటే.. రెండున్నర లక్షల నజరానా

శుక్రవారం, 1 నవంబరు 2019 (12:28 IST)
కులాంతర వివాహాలకు ప్రోత్సాహకంగా ఇచ్చే నగదు మొత్తం పెరిగింది. ప్రేమ వివాహాలు సర్వసాధారణమైన నేపథ్యంలో కులాంత వివాహాలు చేసుకున్న జంటలకు రెండున్నర లక్షల రూపాయల నజరానా ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
 
గతంలో ఇలా కులాంతర వివాహం చేసుకున్న వారికి 50వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచిన రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
 
అయితే ఇందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రేమ వివాహం కచ్చితంగా కులాంతర ప్రేమ వివాహమే అయి ఉండాలి. ఒకే కులంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు ఈ ప్రోత్సాహం లభించదు. అంతేకాదు.. వధూవరుల్లో ఎవరో ఒకరు ఎస్సీ అయి ఉండాలి. ఒకవేళ బీసీలు, ఇతర కులాల వారు ప్రేమ వివాహం చేసుకుంటే.. బీసీ కార్పోరేషన్ ప్రోత్సాహకం ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు