చంద్రబాబు నిర్వాకం వల్లే పోర్టు ఆగింది: జీవీఎల్

శుక్రవారం, 9 ఆగస్టు 2019 (16:55 IST)
ఒంగోలు జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం పోర్టు ఏరియాను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రామాయపట్నం పోర్టు ఆగిందని ఆరోపించారు. రామాయపట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారన్నారు. తన సొంత ప్రయోజనాలు నెరవేరకపోవడంతో... రామాయపట్నం, కనిగిరి నిమ్జ్‌ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబు మనుషులు ఇక్కడ భూములు కొనడమే దానికి కారణమని జీవీఎల్ ఆరోపించారు.
 
ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
 
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులకు, జూనియర్ డాక్టర్లకు మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంగీకరించింది. 13 జిల్లాల జూనియర్ డాక్టర్లు, ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు