తిరుమలలో దారుణాతి దారుణ పరిస్థితులు.. భక్తుల అవస్థలు చూడతరమా? (Video)

ఠాగూర్

శుక్రవారం, 31 మే 2024 (09:30 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై దారుణాతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 30 నుంచి 40 గంటల పాటు క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇలాంటి వారికి కనీసం తాగేందుకు తాగు నీటిని సైతం తితిదే సిబ్బంది ఇవ్వడం లేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చే భక్తులు మళ్లీ భవిష్యత్‌లో తిరుమలకు రాకూడదన్న సంకల్పంతోనే తితిదే అధికారుల ప్రవర్తన ఉంటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో పరిస్థితులు మరింత దారుణంగా దిగజారిపోయాయని అన్నారు. క్రైస్తవులుగా ఉన్న ముఖ్యమంత్రి, తితిదే ఛైర్మన్, ఇతర అధికారులు శ్రీవారి భక్తుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వేచివున్నారు. దర్శనానికి కనీసం 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. దీంతో ఎస్ఎస్డీ టోకెన్లను కూడా తితిదే అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి భక్తుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Huge Devotees Rush at Tirumala : తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ - TV9 #HugeDevoteesRush #Tirumala #tv9telugu pic.twitter.com/dfnZqMI4Ad

— TV9 Telugu (@TV9Telugu) May 31, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు