ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పిన చల్లని కబురు శుక్రవారం నిజమైంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు కురిశాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో శుక్రవారం అకాల వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది.
ఈ క్రమంలో 13వ రోజు బస్సుయాత్రలో భాగంగా ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం చేరుకున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా వాన కురిసి.. ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది.