తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఆదివారం, 24 జులై 2022 (15:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా, తెలంగాణలో 10 జిల్లాల్లోనూ, ఏపీలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
వచ్చే నాలుగు వారాల పాటు తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఉమ్మడి వరంగల్ జిల్లాలున్నాయి.
 
ఇక మరో 12 జిల్లాలకు ఆరెంజ్‌, ఇంకో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ వాతావరణంలో మార్పుల కారణంగా అప్పటికప్పుడు కారు మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు