ఇందులో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, తాను ఎక్కడకు పారిపోలేదన్నారు. వడదెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ తాను పరారయ్యానని, తనను వెంటాడుతున్నారని కథనాలు రావడం బాధాకరమన్నారు. రవిప్రకాష్, తనకు మధ్య జరిగిన షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ అని.. అనవసరంగా దాన్ని క్రిమినల్ పంచాయితీ చేశారని వాపోయారు.
నిజానికి టీవీ 9లో కొన్ని షేర్లను గత యేడాదిలో కొనుగోలు చేశామని ఇపుడు యాజమాన్యం మారింది కాబట్టి షేర్ల గురించి అడిగానని తెలిపారు. ఇందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. మా ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరు? అని ప్రశ్నించారు. కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారన్నారు. సోదాలు చేసి ఏమీ దొరకలేదని తెలిపారు. తన భార్యతో సంతకం చేయించుకొని వెళ్లిపోయారని వివరించారు.
రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తనపై పగ పట్టిందన్నారు. ఇందులో కొంతమంది ఆంధ్రా నాయకులు కూడా ఉన్నారన్నారు. తాను హైదరాబాద్‌లో సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారన్నారు. తనపై వంద కేసులు కాదు.. వెయ్యి పెట్టుకున్న భయమేమీలేదన్నారు. ఇవన్నీ సిల్లీ కేసులంటూ కొట్టిపారేశారు.