ఆ జాతీయ పార్టీ చేతిలో 'పాచికలు'గా మారిన ఆ ఇద్దరు ఎవరు?

గురువారం, 22 మార్చి 2018 (20:02 IST)
టాలీవుడ్ సినీ హీరో గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు భారీ ప్రణాళికనే రూపొందించిందని చెప్పుకొచ్చారు. అంతేనా, ఆ జాతీయ పార్టీ చేతిలో పాత నేత ఒకరు, కొత్త నేత వరకు కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ఇపుడు ఆ ఇద్దరు నేతలు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఓ జాతీయ పార్టీ దక్షిణాదిపై ఆపరేషన్ ద్రవిడ చేపట్టిందని ఆయన తన స్పీచ్ ప్రారంభించారు. ఇందులో భాగమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో ఆపరేషన్ గరుడ అని చెప్పారు. 
 
ఈ విషయం తనకు 2017లోనే తెలుసని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ నిజాలు చెప్పక తప్పలేదన్నారు. ఇప్పుడీ రాష్ట్రంలో జాతీయపార్టీ పెట్టిన మిషన్‌లో ఇద్దరు కీలక వ్యక్తులున్నారని చెప్పుకోవాలి. ఈ మొత్తం ఆపరేషన్‌కు ప్రధానమైనటువంటి వ్యక్తి ఒకరున్నారన్నారు. 
 
ఆ ప్రధాన వ్యక్తిని గురు అని పిలుస్తారు. ఈ గురు ఆదేశాలను రాజ్యంగ బద్ధమైనటువంటి పదవుల్లోని కొందరు ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తారు అంటూ నిశితంగా మ్యాప్ రూపంలో శివాజీ వివరించారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది చెప్పడానికి శివాజీ సాహసించలేకపోయారు. ఎందుకంటే తాను న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోలేనని బహిరంగంగా చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు