ఈ నేపథ్యంలో ఆ యువతికి మరో అబ్బాయితో ఈనెల 10వ తేదీన పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. పెళ్లి పత్రికలు కూడా పంపిణీ చేశారు. ఇంతలో గురువారం రాత్రి వధువు తన ప్రియుడితో కలిసి లేచిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబీకులు వినోద్‌కుమార్ ఇంటిపై దాడి ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేశారు.