తిరుపతిలో హిజ్రాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్ళిమండపాలకు వెళుతూ పెళ్ళికొడుకు, పెళ్ళి కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆశీర్వాదం అంటూ వారి నుంచి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఇవ్వకపోతే..అంతే సంగతి.
తిరుపతి సమీపంలోని తిరుచానూరు కళ్యాణమండపంలో ఒక వివాహం జరుగుతుండగా హిజ్రాలు రెచ్చిపోయారు. నేరుగా పెళ్ళిమండపంలోకి వచ్చిన 30 మంది హిజ్రాలు పదివేలు ఇవ్వాలంటూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురును చుట్టుముట్టారు. కాసేపు బంధువులను కూడా రానివ్వలేదు.