మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ (Video)

ఠాగూర్

గురువారం, 13 మార్చి 2025 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, పెంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల అందరి సమక్షంలో గుంజీలు తీశారు. విద్యార్థులు చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థుల్లో విద్యా పురోగతి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంటూ ఆయన విద్యార్థుల సమక్షంలో గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకుండా, మాట వినని, సరిగా చదవని విద్యార్థులను దండించకుండా విద్యార్థుల సమక్షంలో తనను తాను శిక్షించుకున్న హెడ్మాస్టర్ చింత రమణను ఆయన ప్రత్యేకంగా అభినందింస్తూ ట్వీట్ చేశారు. 
 
ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఈ వీడియోను షేర్ చేస్తూ హెచ్‌ఎంను అభినందిస్తూ చేసిన ట్వీట్‌లో.. "పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చింది. 
 
హెడ్మాస్టర్ గారూ... అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం'' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.  

 

విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలి మండ‌లం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గారు పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని....విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా నా దృష్టికి వ‌చ్చింది. హెడ్మాస్ట‌రు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5

— Lokesh Nara (@naralokesh) March 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు