ఈనెల 23, 24 తేదీల్లో బయోఫోర్, ఇండియాబుల్స్, మనతెలుగు అసోసియేషన్, డీకన్సెస్ గేట్వే హాస్పిటల్స్ సుమారు కోటి 56లక్షల విలువైన మందులు, హెల్త్ కిట్స్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారని తెలిపారు. మందులు, ఇతర వస్తువులన్నీ ఆయా జిల్లాల్లో విరాళాలు ఇచ్చిన వారు సూచించిన ప్రదేశాలకు పంపడం జరిగింది.
అక్కడ సంబంధిత అధికారులు వాటిని అందుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరింత మంది కరోనాను ఎదుర్కొనడంలో ముందుకు రావాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.