విశాఖ HPCL అగ్ని ప్రమాదం: 20 అగ్నిమాపక యంత్రాలు, నావికాదళం, పోలీసులతో అదుపులోకి..

మంగళవారం, 25 మే 2021 (18:06 IST)
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ HPCL రిఫైనరీస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పావుగంటలో చేరుకున్నాయి. మొత్తం 20 అగ్నిమాపక శకటాలు, నావికాదళం, పోలీసులు రంగప్రవేశం చేసి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
 
ఓవర్‌హెడ్ పైప్‌లైన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. సిడియులోని మూడవ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ పైప్‌లైన్ దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ వివరించారు. యూనిట్ మొత్తం మూసివేసినట్లు తెలిపారు.
 
పరిస్థితి అదుపులో ఉందనీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం అందిందని, వెంటనే అంతా అప్రమత్తమయ్యారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు