ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిన లేబర్ అధికారి...ఎక్కడ?

శుక్రవారం, 24 మార్చి 2017 (14:18 IST)
వనపర్తి జిల్లాకు చెందిన లేబర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న ప్రియుడితో కలిసి ఉండగా ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న తీరుపై భర్త మహేష్‌కు అనుమానం ఉంది. ఈ నేపద్యంలో ఆమె కదలికలపై ఓ కన్నేసి ఉంచిన మహేష్ తనకు తెలియకుండా ఇంకొకరితో గడుపుతుందని నిర్ధారణకు వచ్చాడు. 
 
ఈ నేపధ్యంలో వనపర్తిలోనే నంది హిల్స్ హోటల్‌లో ప్రియుడుతో కలిసి ఉందని సమాచారం అందుకున్న మహేష్ అక్కడకు వెళ్లి ప్రియుడుతో ఉండగా భార్య లక్ష్మీప్రసన్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ప్రియుడు గోపిరెడ్డి కామారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ లేబర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారని నిర్ధారణ అయింది.

వెబ్దునియా పై చదవండి