వర్షాకాలంలో నల్ల మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ మన ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. నల్ల మిరియాలు జలుబు, దగ్గును దరిచేరనివ్వవు. శ్వాస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.
ఇవి శరీరంలో వచ్చే వాపును, నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. ఇది కీళ్ళు ఆరోగ్యంగా పని చేయడానికి దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను నల్ల మిరియాలు వేగవంతం చేస్తాయి. జీవక్రియ చురుకుగా పని చేయడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సహజ మార్గంగా ఉపయోగపడుతుం