హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. వివరాల్లోకి వెళితే.. డబీర్ పూర్ స్టేషన్‌కు కొంచెం దూరంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మహిళను హత్య చేసి.. ఆ శరీరానికి బురఖా వేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచారు. ఆపై ఆ బ్యాగ్‌ని బియ్యపు సంచిలో పెట్టారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ హత్యకు గురై రెండు రోజులైందని, గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.
ప్రేమవివాహం చేసుకున్న కాసేపటికే దంపతులు పురుగుల మందు తాగారు. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి అంజలి మృతి చెందగా, యువకుడు లోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.