అక్క భర్తతో అక్రమ సంబంధం నెరపిన మరదలు చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చదువుకుంటానంటూ హైదరాబాద్ వచ్చిన యువతి.. అక్క ఇంట్లో బసచేసింది. ఈ క్రమంలో బావతో ఆమెకు సాన్నిత్యం ఏర్పడింది. అంతే అక్కను మోసం చేసి.. బావతోనే అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన నర్సింహులు ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీనగర్‌లో ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం నర్సింహులు భార్య సోదరి సునీత (28) చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె సోదరి కూడా అడ్డు చెప్పలేదు. దీంతో సునీత నర్సింహులు తమ సంబంధాన్ని కొనసాగించారు.
ఈ సమయంలో నర్సింహులు భార్య, కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్లారు. గొడవతో మనస్తాపం చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి కొక్కేనికి చీరతో ఉరేసుకుంది. దీన్ని గమనించిన నర్సింహులు స్థానికుల సహాయంతో సునీతను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.