అందమైన అమ్మాయి అనుకుని చాటింగ్ చేశాడు.. కలుద్దామని వెళితే.. చివరకు.?

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (18:30 IST)
అందమైన అమ్మాయి ముసుగులో ఒక ముఠా ఒక యువకుడిని కిడ్నాప్ చేసింది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఫేక్ ఐడిలు సృష్టించి యువకులను మోసం చేస్తూ వారిని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకునే ముఠాను ఎట్టేకేలకు పట్టుకున్నారు హైదారాబాద్ సిటీ పోలీసులు.
 
వినోద్.. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో వీడియో ఎడిటింగ్ మిక్సింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. మంచి ఆదాయం. తండ్రి సహకారంతో ఆ బిజినెస్‌లో నిలదొక్కుకున్నాడు వినోద్. అయితే వినోద్‌కు పెళ్ళి కాలేదు. ఖాళీ సమయాల్లో ఫేస్‌బుక్‌లలో అమ్మాయిల ఫోటోలను చూస్తూ వారు అందంగా ఉంటే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం వినోద్‌కు ఉన్న అలవాటు.
 
సరిగ్గా రెండు నెలల క్రితం అలాగే శ్వేత పరిచయమైంది. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. పర్సనల్ మెసేజ్‌లు పంపుకోవడం వరకు వీరి మధ్య పరిచయం ఏర్పడింది. నేరుగా కలుద్దామని ఆమెను కోరాడు వినోద్. మూడురోజుల క్రితం ఆమె ఉప్పల్‌లోని ఒక ఐస్ క్రీం షాప్ వద్దకు రమ్మంది.
 
ఎంతో ఆశతో వెళ్ళిన అక్కడకు వెళ్ళాడు వినోద్. అయితే శ్వేత అక్కడ లేదు. ఆమె అన్న అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నా చెల్లెలు మిమ్మల్ని తీసుకురమ్మందని అతనితో పాటు కలిసి వెళ్ళాడు. నిర్మానుషమైన ఫ్యాక్టరీ వద్దకు వినోద్‌ను తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఇక్కడే శ్వేత ఉందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.
 
పీకల్లోతు ప్రేమలో ఉన్న వినోద్ అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిందే వినోద్ తలపై గట్టిగా కొట్టాడు ఆ వ్యక్తి. సృహ తప్పి పడిపోయాడు వినోద్. మొన్న ఉదయం లేచి చూసేసరికి ముగ్గురు వ్యక్తులు కనిపించారు. శ్వేత లేదు ఏమీ లేదు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయ్..మీ నాన్నకు ఫోన్ చేయ్.. డబ్బులు తీసుకురమ్మని చెప్పు అని బెదిరించారు.
 
అప్పుడు కానీ వినోద్‌కు అర్థం కాలేదు. తనను కిడ్నాప్ చేశారని.. తన మొబైల్ నుంచే తండ్రికి ఫోన్ చేశాడు. తన వద్దనున్న డబ్బులు, చైను, ఉంగరాలను లాక్కున్నారని.. 5 లక్షల రూపాయల డబ్బులిస్తే తప్ప తనను వదలరని ఫోనులో బోరున విలపించాడు. దీంతో తండ్రి నేరుగా నిన్న సాయంత్రం పోలీసులను ఆశ్రయించాడు. 
 
ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉప్పల్‌లోని ఒక ఫ్యాక్టరీ‌లో వినోద్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి చాకచక్యంగా వినోద్ దగ్గరకు వెళ్ళారు. అతన్ని సురక్షితంగా రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి ప్రేమమైకంలో ఉన్న యువకులందరూ ఒకటే గుర్తించాలి.. గుడ్డిగా నమ్మి ఎవరు ఏది చెబితే అది నమ్మి వారి వెంట వెళ్లకూడదని వినోద్ స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు