బిర్యానీ తిన్నారు... చాయ్ తాగారు... సరదా కోసం అతివేగంతో కారు నడిపి..

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:27 IST)
ఆరుగురు ప్రాణస్నేహితులు. బిర్యానీ ఆరగించారు. చాయ్ తాగారు. సరదా కోసం అతివేగంతో కారు నడిపారు. చివరకు ప్రమాదానికిగురై ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాణస్నేహితుల్లో ఒకరు మాత్రం మృత్యుఒడిలోకి జారుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని భరత్ నగర్ వంతెనపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. 
 
ఈ కారులో ప్రయాణించిన ఆరుగురు స్నేహితులు.. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి మృత్యుఒడిలోకి జారుకున్నారు. ఈ ప్రమాదంలో అతివేగంతో వెళ్తున్నకారు అదుపు తప్పి వంతెన రెయిలింగును ఢీకొని 30 అడుగుల పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో బోరబండకు చెందిన మహ్మద్ సోహైల్ (27) అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, సునీల్ (22), మోహిజ్ (19), గౌస్ (20), ఇర్ఫాన్ (18), అశ్వక్ (18) తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ఆరుగురు ప్రాణస్నేహితులు అర్థరాత్రి పూట హైదరాబాద్ నగరంలో కారులో షికారుకెళ్లడం ఆనవాయితీ. ఈ క్రమంలో తొలుత వీరందరూ హైటెక్ సిటీ వెళ్లి బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి బాలానగర్ చేరుకుని టీ తాగారు. తిరిగి బోరబండ వస్తూ అర్థరాత్రి దాటాక 2:10 గంటల సమయంలో భరత్‌నగర్ బ్రిడ్జిపైకి వచ్చారు. 
 
అయితే, కారును అతివేగంతో నడపడంతో వంతెనపై కారు రెప్పపాటులో అదుపుతప్పి వంతెనను ఢీకొని జేసీబీ బాస్కెట్‌పై పడింది. దీన్ని గమనించిన స్థానికులు... కారులో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో వెలికితీసి పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
సోహైల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మిగతా వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, కారులో ఉన్నవారు ఎవరూ మద్యం తాగలేదని తేలింది. 
 
 
రాజధాని ఉద్యమానికి బంగారు గాజుల విరాళం 
Vijayanagaram woman donate gold bangles to Amaravati Capital Movement
Vijayanagaram, Woman, Gold Bangles, Donate, Amaravati Capital Movement, విజయనగరం, మహిళ, బంగారు గాజులు, విరాళం, అమరావతి, రాజధాని, రైతు ఉద్యమం
 
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ గత 64 రోజులుగా ఉద్యమంసాగుతోంది. ఈ ఉద్యమంలో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన 29 మండలాలకు చెందిన రైతులు ఈ ఉద్యమానికి ఊపిరిగా ఉన్నారు. 
 
మరోవైపు, ఈ ఉద్యమానికి అన్ని ప్రాంతాల వారు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంవీ ప్రసన్నశ్రీ అనే మహిళ అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. తన చేతికి ఉన్న గాజులను తీసి అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళంగా అందించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టమని ఆవేదన వ్యక్తంచేశారు. విజయనగరంలో తమకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయని, విశాఖకు రాజధాని రావడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రసన్నశ్రీ తేల్చి చెప్పారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు