నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనీ... 5 అంతస్తుల భవనంపై నుంచి...

మంగళవారం, 5 జూన్ 2018 (15:16 IST)
నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. ఇంటర్‌లో 1150 పైచిలుకు మార్కులు సాధించినప్పటికీ.. నీట్ పరీక్షలో అర్హత సాధించలేక పోయారు. ఫలితంగా బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
హైదరాబాద్ నగరం అబిడ్స్‌లోని మయూరీ కాంప్లెక్స్‌ ఐదో అంతస్తు నుంచి ఓ యువతి దూకేసింది. తొలుత ఈ యువతి ఎవరన్నది గుర్తించలేక పోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
అనంతరం ఆ అమ్మాయి ఎవరు? ఎందుకీ ఘటనకు పాల్పడిందన్న విషయాలను పోలీసులు సేకరించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18)గా గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు