హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి(26), వేణుగోపాల్ అలియాస్ వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 2012లో జరిగింది. వీరి సంసారజీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ క్రమంలో తనతో పాటు పని చేసే ఓ యువతితో వంశీకి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇదిలావుండగా, సంస్థ ప్రచార పని మీద వంశీ గోవాకు వెళ్లాడు. అక్కడ మరో యువతితో సంబంధం నెరిపాడు. ఆమెనూ వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకున్నాడు. అతని భార్యకు తెలియడంతో మనోవేదనకు గురై శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి ఇంట్లో ఉన్న ఆమె సోదరి ప్రశాంతి అక్క పరిస్థితిని గమనించి జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణగండం తప్పింది.